కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ప్రజల నుండి 83 అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన తీర్చడానికే పరిష్కార వేదిక ఏర్పాటు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను 15 రోజుల్లో పరిష్కరించడానికి కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు. కడా పీడి వికాస్ మర్మత్, అధికారులు పాల్గొన్నారు.