కుప్పం నియోజకవర్గంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. కుప్పం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, వివిధ పాఠశాలలు, రెస్కో కార్యాలయం, ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జాతీయ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు. శ్రీకాంత్ మాట్లాడుతూ. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మరువలేవని అన్నారు. దేశ సమైక్యతను కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని అన్నారు.