అఖిలభారత భీమా ఉద్యోగుల సంఘం 74వ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని స్థానిక ఎల్ఐసి కార్యాలయం ఆవరణంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరుపతి సిమ్స్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి శ్రీధర్ బాబు సహకారంతో రక్తదానం శిబిరం ఏర్పాటు చేసారు. రక్తదానం చేసేవారిలో కే ఎం ఆర్ పుత్తూరు కాలేజ్ ఫిజియోథెరపీ విద్యార్థులు పాల్గొన్నారు.