ఉపాధ్యాయులు గంగయ్య సేవలు ప్రశంసనీయమని ఎంఈఓ హరి ప్రసాద్ వర్మ పేర్కొన్నారు. బుధవారం విజయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం శ్యామల మాట్లాడుతూ గంగయ్య అంకితభావంతో 28 సంవత్సరాలు విద్యారంగంలో విశిష్ట కృషి చేశారని ఎంతోమంది విద్యార్థుల ఉన్నతకి కారకులైనరని పేర్కొన్నారు.