127 కేసులు పరిష్కారం: సీనియర్ సివిల్ జడ్జ్

71చూసినవారు
127 కేసులు పరిష్కారం: సీనియర్ సివిల్ జడ్జ్
పలమనేరు పట్టణంలోని సీనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 127 కేసులు పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జ్ పగడాల శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. 12 క్రిమినల్ కేసులు, 57 బ్యాంకులకు సంబంధించిన కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్