పలమనేరులో మంగళవారం రథసప్తమి వేడుకలు సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సూర్యప్రభవాహనం పై కొలువు తీర్చి 108 హారతులు ఇచ్చారు. అనంతరం సూర్య భగవానుడు కిరణాలు సూర్యప్రభవాహనంపై పడిన అనంతరం మహా మంగళారతి ఇచ్చి, పలమనేరు పురవీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారి దర్శనార్థం కోసం తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.