మృతురాలు పలమనేరు మహిళగా గుర్తింపు

580చూసినవారు
మృతురాలు పలమనేరు మహిళగా గుర్తింపు
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలంలోని దివిటివారిపల్లె పొలంలో గురువారం రాత్రి దారుణ హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యమైంది. మృతురాలు పలమనేరులోని నాగలరాళ్ల వీధికి చెందిన గణపతి భార్య భారతి (20)గా గుర్తించామని సీఐ సద్గురుడు శుక్రవారం తెలిపారు. రామాంజులు పొలంలోని పాకలో భారతిని కొందరు చంపేశారు. అది గమనించిన రామాంజులు అక్కడికి వెళ్లడంతో అతడిపైనా దాడి చేసి పారిపోయారు. ఆయన చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్