హత్యాచార నిందితులను బహిరంగంగా ఉరితీయాలి

67చూసినవారు
హత్యాచార నిందితులను బహిరంగంగా ఉరితీయాలి
కలకత్తాలో జూనియర్ డాక్టరుపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని ఎన్. ఎస్. యూ. ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్. ఎస్. యూ. ఐ జాతీయ అధ్యక్షుని ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి ఎన్. ఎస్. యూ. ఐ ఆధ్వర్యంలో పీలేరు అంబేద్కర్ కూడలిలో క్రొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ఎన్. ఎస్. యూ. ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి సంపత్, రెడ్డి కిషోర్, శివ కృష్ణ, చందు, లోకేశ్వర్, విక్రమ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్