పూతలపట్టు నియోజకవర్గంలో జులై 1న పండగ వాతావరణంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే మురళిమోహన్ అధికారులను ఆదేశించారు. పూతలపట్టు ఎంపీడీవో ఆఫీసులో సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పూతలపట్టును అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఎంపీడీవో ప్రసన్నకుమారి, ఎమ్మార్వో సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.