కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు వారు స్పష్టం చేశారు.