చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన ఆదిత్యన్ కారులో మొగిలి నుంచి పలమనేరుకు బయల్దేరాడు. ఓవర్ టేక్ చేసే సమయంలో అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టాడు. దీంతో కారు బోల్తా పడింది. ఆదిత్యన్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రవీణ్ కుమార్, రితిక్ అని మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ లక్ష్మయ్య కేసు నమోదు చేశారు.