పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి గురువారం రాయచోటి లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ని కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించాలని చల్ల బాబు మంత్రిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. చల్లా బాబు వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.