చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్ళ పల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి శుక్రవారం తిరుపతిలోని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నివాసంలో ఇరుముడి పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టి శబరిమలై యాత్రకు పెద్దిరెడ్డి బయలుదేరారు.