స్కూల్ బస్సులకు రికార్డులు, ఫిట్నెస్ లేకపోతే సీజ్ చేస్తామని ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. శుక్రవారం ఆమె స్కూల్ బస్సులను స్వయంగా నడిపి, ఫిట్నెస్ చెక్ చేశారు. ఆమె మాట్లాడుతూ. పుంగనూరు పట్టణంలోని స్కూల్ బస్సు యజమానులు తక్షణమే తమ బస్సులకు ఇన్సూరెన్స్, ఫర్మిట్, పొల్యూషన్తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలన్నారు. రికార్డులు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.