రాబోయే ఎన్నికలలో వైసిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మండలంలోని తిమ్మనా యన పల్లి పంచాయతీలో మాజీ ఎంపీపీ ఇందిరమ్మ, యువ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.