తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులో సీపీఐ శత వార్షికోత్సవంలో భాగంగా గిరి ఆ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా సీపీఐ సత్యవేడు నియోజకవర్గం కార్యదర్శి అంబాకం చిన్ని రాజ్ మాట్లాడుతూ. సీపీఐ 1925 డిసెంబర్ నెల 26వ తేదీన కాన్పూర్లో స్థాపించడం జరిగిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా శ్రేయస్సు కొరకు పోరాటాలు, త్యాగాలతో పునితమైందనిచెప్పారు.