సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం కన్వీనర్ ఆరణి విధ్యానాధ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.