శ్రీకాళహస్తి పట్టణ టూ టౌన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు సీఐ వెంకటేశులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ట్రాఫిక్ నిబంధనలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లకు లైసెన్స్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ప్రయోజనాల గురించి వివరించారు. ప్రయాణికులతో మంచిగా నడుచుకోవాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఆటోలకు సీరియల్ నంబర్ ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు.