సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిమూలం మాట్లాడుతూ. నూతన కమిటీ ఎప్పటికప్పుడు ఆసుపత్రి పరిస్థితిని సమీక్షిస్తూ అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.