తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం పులికుండ్రం, వెంళత్తూరు, పిళ్ళారికండ్రిగ గ్రామాల్లో గురువారం 450 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో రూ. 14. 5 లక్షల ఉపాధి హామి నిధులతో పనులు నిర్వహించినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.