జపాన్ లోని ఎహైమ్ రాష్ట్రానికి చెందిన 25 మంది ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీని మంగళవారం సందర్శించింది. గవర్నర్ టోకిహిరో నకమురా నేతృత్వంలో విచ్చేసిన బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ ప్రత్యేకతలు, వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ పరిశ్రమల ఉనికి గురించి వివరించారు. శ్రీసిటీ అధునాతన మౌలిక వసతులను ప్రతినిధులు వీక్షించారు.