తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండల బీజేపి అధ్యక్షుడిగా కుమరేశన్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.