తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో శనివారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. ఆయన చేతులమీదుగా నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్ రెడ్డి, ఎంఆర్ఓ రాజశేఖర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.