సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం కృష్ణాపురం లో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం సహాయనిధి పేదలపాలిట వరమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.