సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకన్న ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు, పూజలు చేశారు. ధూప దీప, కర్పూర హారతులు అందించిన అనంతరం స్వామివారిని హనుమంతుడి వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం చేపట్టారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు అందించి మొక్కులు తీర్చుకున్నారు.