సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం పాలమంగళం దక్షిణ కండ్రిగలో 10 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం పాలమంగళం దక్షిణపరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.