పిచ్చాటూరు మండలంలోని సిద్దిరాజుకండ్రిగ గ్రామంలోని శ్రీ హనుమంతీశ్వరాలయంలో శుక్రవారం సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు నవీన్ శర్మ స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త జ్యోతి కుమార్ పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు..