సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల కేంద్రంలోని అరణీయార్ ప్రాజెక్టులో చేపల పెంపకం కోసం 10 లక్షల చేపల పిల్లలను వదిలే కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ హాజరయ్యారు. వారి చేతులమీదుగా చేపపిల్లలను వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.