తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణ అభయమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.