గుంతలమయంగా సత్యవేడు-జడేరి రోడ్డు

74చూసినవారు
గుంతలమయంగా సత్యవేడు-జడేరి రోడ్డు
తిరుపతి జిల్లా సత్యవేడు నుంచి జ డేరి గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని జడేరి గ్రామస్థులు శనివారం తెలిపారు. నిత్యం ఈ దారిలో లారీలు గ్రావెల్ లోడుతో వెళుతుంటాయన్నారు. దీంతో ఈ గుంతలు ఏర్పిడినట్లు వారు తెలిపారు. గుంతల కారణంగా వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్