సత్యవేడు: జాయింట్ కలెక్టర్ కు ఎమ్మెల్యే వినతి

71చూసినవారు
సత్యవేడు: జాయింట్ కలెక్టర్ కు ఎమ్మెల్యే వినతి
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం లో ఇల్లు లేని పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ను కోరారు. శనివారం ఎమ్మెల్యే తిరుపతి లోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఈ మేరకు వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ కు అందజేశారు. జేసీ శుభం బన్సల్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్