సత్యవేడు మండలం దాసుకుప్పం సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఫిబ్రవరి 8వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఏఈ రవి పేర్కొన్నారు. దాసుకుప్పం, సురుటుపల్లి టెంపుల్, చెన్నేరి, పుదుకుప్పం, సీతారాంపేట, అంబాకం, మధనంజేరి, తొండుగులి ప్రాంతాలకు సరఫరా ఉండదన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు.