దళిత ఆటో డ్రైవర్ లక్ష్మయ్యపై దాడి చేసిన అగ్రకులాల వారిని అరెస్టు చేయాలని కోరుతూ సత్యవేడు సీఐ ఆఫీస్ ముందు బుధవారం ధర్నా చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు దాసరి జనార్ధన్ మాట్లాడుతూ.. దళితులపై దాడులు జరగడం రివాజుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ, ఆటో యూనియన్, కేవీపీఎస్ నాయకులు మునస్వామి, కృష్ణయ్య, బాబు, అలిమేలు, మంజుల పాల్గొన్నారు.