పిచ్చాటూరులో ధర్మరాజు తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం మహిళల పాలముంత ఊరేగింపు జరుగుతుంది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ధర్మరాజు స్వామికి పాలాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం అర్జున స్వామి ఉత్సవమూర్తికి తిరువీధి ఉత్సవం ఉంటుంది.