వైకుంఠ ఏకాదశి సందర్భంగా సత్యవేడు నియోజకవర్గం నాగాలాపురంలో ఈ నెల 10న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో వేడుకలు నిర్వహిస్తున్న ఆలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. భక్తుల దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావలసిన క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 10వ తేదీ ఉదయం 4 నుంచి 10 వరకు, 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.