శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని వికృత మాలలో ఉన్న సంతాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను డి. ఎస్. పి, సీఐ జయచంద్ర ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలను అందుకున్నారు.