శ్రీకాళహస్తిలోని స్థానిక బేరివారి మండపం వద్ద బీజేపీ నాయకులు శనివారం సంబరాలు నిర్వహించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలవడంతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అన్నారు.