శ్రీకాళహస్తీశ్వర స్వామిని భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్, రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి సతీష్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు.