శ్రీకాళహస్తిలో శివరాత్రి ఏర్పాట్లకు అందరూ సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని నాలుగు మాఢ వీధులను ఆయన పరిశీలించారు. దుకాణాల ముందు ఉన్న రేకులు తొలగించాలని యజమానులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.