శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్

50చూసినవారు
శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్
శ్రీకాళహస్తీశ్వర స్వామిని శుక్రవారం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద ఆలయ మర్యాదలతో సత్కరించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్