శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర ఖాది విలేజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కేకే చౌదరి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రంగనేని చెంచయ్య నాయుడు, బాలాజీ రెడ్డి, రవి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు.