రేణిగుంటలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

69చూసినవారు
రేణిగుంటలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్