ఏర్పేడులో పర్యటించిన ఎమ్మెల్యే

ఏర్పేడు మండలం గుడిమల్లంలోని ఆనందవల్లి సమేత పరశు రామేశ్వర స్వామిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మాజీ ఛైర్మన్ బత్తలగిరి నాయుడు, కార్య నిర్వాహణాధికారి రామచంద్రారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారా అని భక్తులు చర్చించుకుంటున్నారు.