తొట్టంబేడు మండలంలోని రైతులు డిజిటల్ గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సురేంద్రనాథ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీలోపు రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా గుర్తింపు కార్డులను పొందాలని తెలిపారు. దీనికోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ తీసుకొని రావాలని తెలిపారు.