శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చెంగల్వా రాయల్ స్వామిని శ్రీవల్లి దేవసేన ఉత్సవమూర్తులను గజమాలతో చక్కగా అలంకరించారు. చిలుక వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ నాగభూషణ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.