శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు పత్రాలు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. విద్యుత్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు వారి సమస్యలను వారికి తెలియచేయవచ్చన్నారు.