రేణిగుంట: కట్ట పుట్టాలమ్మ హుండీ ఆదాయం రూ.8.88 లక్షలు

54చూసినవారు
రేణిగుంట: కట్ట పుట్టాలమ్మ హుండీ ఆదాయం రూ.8.88 లక్షలు
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని శ్రీశ్రీ కట్ట పుట్టాలమ్మ ఆలయ హుండీ కానుకలను శనివారం సాయంత్రం లెక్కించారు. ఆదాయం రూ. 8.88 లక్షలు వచ్చిందని ఆలయ ఛైర్మన్ పాడి రాజేంద్ర వెల్లడించారు. నాలుగు నెలలకు సంబంధించి భక్తులు ఈ మేరకు కానుకలు సమర్పించారని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్