శ్రీకాళహస్తి సమీపంలో రోడ్డు ప్రమాదం

82చూసినవారు
శ్రీకాళహస్తి సమీపంలో రోడ్డు ప్రమాదం
తొట్టంబేడు మండలం కన్నలి హైవే రోడ్డుపై మంగళవారం 2 కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు (మం), ఓగూరు గ్రామానికి చెందిన మురళి తిరుపతిలో మేస్త్రి పని చేస్తుంటాడు. మంగళవారం స్వగ్రామంలో తమ్ముడు పెళ్లి చూసుకొని కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. కన్నలి సమీపంలో వేలూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారును ఢీకొన్నారు. కారులో ప్రయాణిస్తున్న మురళి, శ్యామల, హర్షిని, హర్షితకు గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్