శ్రీకాళహస్తిలోని కొండమిట్ట ప్రాంతం నందు వెలసిఉన్న శ్రీశ్రీ జలవినాయకస్వామి15 వార్షికోత్సవం గురువారం వేడుకగా నిర్వహించారు. ముందుగా విగ్నేశ్వరునికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో, అభిషేకాలు నిర్వహించి, కర్పూర హారతులు నీరాజనాలు పట్టారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ఏకదంతుడిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.