ఏర్పేడులో బ్రెయిలీ జయంతి

53చూసినవారు
ఏర్పేడులో బ్రెయిలీ జయంతి
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలోని భవిత కేంద్రంలో శనివారం అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. దివ్యాంగుల కోసం లూయీ బ్రెయిలీ లిపిని కనుగొన్నారని, ఆ ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత, రమాదేవి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్